విద్యా కమిటీ చైర్మన్‌ నియామకంపై నిరసన

ABN , First Publish Date - 2022-11-15T23:20:28+05:30 IST

పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ నియామకంలో అక్రమాలు జరి గాయంటూ రాజంపేట పట్ట ణంలోని మన్నూరు ఉన్నత పాఠశాల ముఖద్వారం ఎదుట పాఠశాల విద్యాకమిటీ వైస్‌ చై ర్మన్‌ మందా శివపార్వతి అధ్వ ర్యంలో మంగళవారం టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ నాయకులు జడ శివ తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

విద్యా కమిటీ చైర్మన్‌ నియామకంపై నిరసన
మన్నూరు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న దళిత నేతలు

రాజంపేట, నవనంబరు 15 : పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ నియామకంలో అక్రమాలు జరి గాయంటూ రాజంపేట పట్ట ణంలోని మన్నూరు ఉన్నత పాఠశాల ముఖద్వారం ఎదుట పాఠశాల విద్యాకమిటీ వైస్‌ చై ర్మన్‌ మందా శివపార్వతి అధ్వ ర్యంలో మంగళవారం టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ నాయకులు జడ శివ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబరు 29న జరిగిన విద్యాకమిటీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎన్నికైన రామాంజుల రెడ్డి కువైత్‌ వెళ్లిపోయాడన్నారు. ఆ స్థానం లో వైస్‌ చైర్మన్‌ శివపార్వతికి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా డీఈవో రాఘవరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి చైర్మన్‌ స్థానాన్ని ఇతరులకు కేటాయించారన్నారు. దళితులనే చిన్నచూపుతోనే ఆమెకు చైర్మన్‌ పదవి దక్కకుండా చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ మన్నూరు ఉన్నత ప్రధానోపా ధ్యాయురాలు కొండూరు పరిమళకు వినతిపత్రం సమ ర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పరిమళ మాట్లాడుతూ విద్యా కమిటీ చట్టం మేరకే తిరిగి ఎన్నికలు నిర్వహించారని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని తెలిపారు.

Updated Date - 2022-11-15T23:20:28+05:30 IST

Read more