సీమ స్థాయి క్రికెట్‌ విజేతకు బహుమతుల ప్రదానం

ABN , First Publish Date - 2022-01-24T04:23:37+05:30 IST

రాయలసీమ స్థాయి క్రికెట్‌ పోటీల్లో విజేతకు నిలిచిన జమ్మలమడుగు జట్టుకు జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం సాయంత్రం టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.

సీమ స్థాయి క్రికెట్‌ విజేతకు బహుమతుల ప్రదానం
క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న భూపే్‌షరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 23: రాయలసీమ స్థాయి క్రికెట్‌ పోటీల్లో విజేతకు నిలిచిన జమ్మలమడుగు జట్టుకు జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం సాయంత్రం టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. భూపేష్‌రెడ్డి సహకారంతో డిసెంబరు 20వ తేదీ జమ్మలమడుగులో రాయలసీమ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను క్రిస్మస్‌ సందర్భంగా సీఎ్‌సఐ యూత్‌ ఆద్వర్యంలో ప్రారంభించారు. అందులో 48 జట్లు పాల్గొనగా జమ్మలమడుగు రాకర్‌-11 జట్టు మొదటి స్థానంలో నిలిచి రూ.30 వేలు మొదటి బహుమతి పొందగా, మోక్షిత్‌-11 జట్టు ద్వితీయ బహుమతి కింద రూ.20 వేలు పొందింది. గెలుపొందిన వారికి నగదు అందజేశారు. కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.

Read more