ప్రధాని వర్చువల్‌ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2022-05-25T05:01:45+05:30 IST

అజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భా గంగా 31న వర్చువల్‌ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యద ర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు.

ప్రధాని వర్చువల్‌ కాన్ఫరెన్స్‌కు  ఏర్పాట్లు చేయండి

రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి

రాయచోటి(కలెక్టరేట్‌), మే24: అజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భా గంగా 31న వర్చువల్‌ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యద ర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదా రులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడనున్నారని ఆయన వివరించా రు. మంగళవారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 31న హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా నుంచి ప్రధాని జాతీయ స్థాయి వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, పౌర సంస్థల సభ్యులు, స్వాతంత్య్ర సమరయోధులతో మాట్లాడనున్నట్లు తెలిపారు.

కాన్ఫరెన్స్‌ లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడనున్నా రన్నారు. నెల్లూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాలోని లబ్ధిదారులను ఎంపిక చేసి సంబంధిత శాఖల అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖా ముఖికి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, డ్వామా పీడీ శివప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ పీవీ ప్రసన్నకుమార్‌, పీఆర్‌ ఎస్‌ఈ కేవీనాయుడు, డీపీఓ పాల్గొన్నారు. 

Read more