-
-
Home » Andhra Pradesh » Kadapa » Prepare for a legal fight-MRGS-AndhraPradesh
-
న్యాయ పోరాటానికి సిద్ధం
ABN , First Publish Date - 2022-03-06T04:34:43+05:30 IST
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే అమరావతిలో వెనువెంటనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు రాజంపేట జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు ప్రకటించారు.

బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జేఏసీ నేతల ప్రత్యేక సమావేశం
రాజంపేట, మార్చి5: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే అమరావతిలో వెనువెంటనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు రాజంపేట జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ నాయకులు ఛాయాదేవి, లక్ష్మీనారాయణ, జనార్ధన్, ప్రభాకర్‌నాయుడు, లక్ష్మీనారాయణ, ప్రతా్‌పరాజు, సంజీవరావు, పూల భాస్కర్, సురే్‌షరాజు, కత్తి సుబ్బరాయుడు, ఎం.ఎ్‌స.రాయుడు, మహేష్, ఇడిమడకల కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాయాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు రాజంపేట పార్లమెంటరీ కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయకపోతే అమరావతి రీతిలో వెనువెంటనే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాజంపేట ప్రజల తరపున న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాడి ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోకపోతే ప్రభుత్వమే కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుందని తొలి విజయం రాజంపేట ప్రజలదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజంపేట ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను కోర్టులో దాఖలు చేస్తామని తెలిపారు.