ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం

ABN , First Publish Date - 2022-06-07T06:03:45+05:30 IST

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం
ఓబులవారిపల్లె: కరపత్రాలు పంపిణీ చేస్తున్నసీపీఎం నాయకులు

రైల్వేకోడూరు, జూన్‌ 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని జిల్లా సీఐటీయూ కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం పట్టణంలోని నరసరాంపేట లో ఇంటింటికి సీపీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న రేషన్‌ వాహనం ద్వారా పురుగులు ఉన్న నాసిరకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గోదాము అధికారులతో మాట్లాడితే బియ్యం వెనక్కితీసుకుంటామని చెప్పారని, అయితే వైసీపీ నేతలు అడ్డుపడి అదే బియ్యాన్ని పంపిణీ చేయించారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం స్వర్ణ రకం బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి ప్రజలకు పురుగులు ఉన్న బియ్యాన్ని పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది గుంజననది ఒడ్డున ఉన్న పేదల ఇళ్లు కొట్టుకునిపోతే ఇంత వరకు ప్రభు త్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గుంజననది కి రక్షణ గోడ కలగా మిగిలిపోయిందని  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల యానాదయ్య, దాసరి జ యచంద్ర, కర్రతోటి హరినారాయణ. పి. జాన్‌ప్రసాద్‌, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

బాలిరెడ్డి పల్లెలో.. 

ఓబులవారిపల్లె : ఓ బులవారిపల్లె మండలం లోని బాలిరెడ్డిపల్లెలో సోమవారం మండల సీ పీఎం నాయకుడు జయరామయ్య ఇంటింటికి సీ పీఎం కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా దే శంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభు త్వాలు అనుసరిస్తున్న విధానా లు, నిత్యావసర సరుకుల ధరల పై అవగాహన కల్పించారు. నాయకులు సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తుండడంతో ప్రజలు  ఇబ్బందులు పడుతు న్నారన్నారు.  పెంచలయ్య, కేశవులు, చెంగయ్య, శివ కు మార్‌వర్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-07T06:03:45+05:30 IST