నేడు విద్యుత్‌ అంతరాయం

ABN , First Publish Date - 2022-01-29T05:17:01+05:30 IST

అత్యవసర మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం ఏఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నేడు విద్యుత్‌ అంతరాయం

వల్లూరు, జనవరి 28: అత్యవసర మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం ఏఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేయడం వల్ల వల్లూరు సబ్‌స్టేషన్‌, పైడి కాల్వ సబ్‌స్టేషన్‌, శాటిలైట్‌సిటీ సబ్‌స్టేషన్‌ పరిధిలో పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపారు.  

చెన్నూరులో...

మండలంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్‌  సరఫరా నిలిపేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ రామలింగారెడ్డి తెలిపారు. చెన్నూరు సబ్‌స్టేషన్‌తోపాటు కనపర్తి, శాటిలైట్‌ సబ్‌స్టేషన్లలో పూర్తిగా విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు

Read more