ప్రజారంజకంగా జడ్పీ పాలన

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

జిల్లా ప్రజాపరిషత్‌ పాలక మండలి ఏడాది కాలాన్ని ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహాకారంతో ప్రజారంజకంగా పూర్తి చేసుకొని... రెండవ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషకరం అని జడ్మీ చైర్మన్‌ అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజారంజకంగా జడ్పీ పాలన
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ అమర్‌నాధ్‌రెడ్డి

అభినందన సమావేశంలో జడ్పీ చైర్మన్‌ అమర్‌నాథ్‌రెడ్డి

కడప(రూరల్‌) సెప్టెంబర్‌ 30 :
జిల్లా ప్రజాపరిషత్‌ పాలక మండలి ఏడాది కాలాన్ని ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహాకారంతో  ప్రజారంజకంగా పూర్తి చేసుకొని... రెండవ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషకరం అని జడ్మీ చైర్మన్‌ అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. జడ్పీ పాలక మండలి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా జడ్పీ సమావేశ హాలులో ఉద్యోగులతో కలిసి అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ సహాకారంతో పల్లెసీమల ప్రగతికి పెద్దపీట వేశామన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్టాండింగ్‌ కమిటీల ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలతో సమీక్షిస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీరు, పౌష్టికాహారం, మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. ఉద్యోగుల అభ్యున్నతికి చర్యలను చేపడుతున్నామని, జడ్పీ పరిధిలో 50 మంది ఉద్యోగులకు పారదర్శకంగా ప్రమోషన్లను కల్పించామని తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయం ఆస్తుల పరిరక్షణతో పాటు ఆదాయాన్ని పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఉద్యోగులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి తక్షణ చర్యలను చేపడతామని చైర్మన్‌ తెలిపారు. అనంతరం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా కట్‌ చేశారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ పిట్టు బాలయ్య, సీఈవో సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more