వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారు

ABN , First Publish Date - 2022-09-30T05:23:52+05:30 IST

వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సాయిలోకేష్‌ తెలిపారు.

వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారు
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత సాయిలోకేష్‌

బి.కొత్తకోట సెప్టెంబర్‌ 29 : వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సాయిలోకేష్‌ తెలిపారు. గురువారం బి.కొత్తకోట మండలం కనికలతోపులో జిల్లా మహిళా మోర్చా ప్రధానకార్యదర్శి శోభారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్నసంక్షేమ అభివృద్ధి కార్యక్ర మాలు గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈసమావేశంలో బీజేపీ రాష్ట్ర కోఆపరేటీవ్‌ సెల్‌ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి,  మండల అధ్యక్షుడు శంకరమూర్తి, నాయకులు సోమశేఖర్‌, జయరామిరెడ్డి, బాబాసాహెబ్‌, వెంకటనారాయణ, ఫరీద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. 


Read more