మార్చి చివరికంతా పీలేరు అగ్రి ల్యాబ్‌ సిద్ధం!

ABN , First Publish Date - 2022-12-30T23:49:35+05:30 IST

పీలేరులో అసం పూర్తిగా ఉన్న వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని జిల్లా వ్యవ సాయ శాఖాధికారిణి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు.

మార్చి చివరికంతా పీలేరు అగ్రి ల్యాబ్‌ సిద్ధం!
అగ్రి ల్యాబ్‌ను పరిశీలిస్తున్న డీఏవో ఉమామహేశ్వరమ్మ

జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి ఉమామహేశ్వరమ్మ

పీలేరు, డిసెంబరు 30: పీలేరులో అసం పూర్తిగా ఉన్న వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని జిల్లా వ్యవ సాయ శాఖాధికారిణి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. పీలేరులో పెండింగ్‌లో ఉంటూ ఇటీవల మరలా నిర్మాణ పనులు జరుగుతున్న అగ్రి ల్యాబ్‌ను శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా, బిల్డింగ్‌ డిజైనలో మార్పుల కారణంగా అగ్రి ల్యాబ్‌ పనులు నెమ్మదించాయని, కాం ట్రాక్టరుతో కలెక్టర్‌ మాట్లాడి పనులను త్వరతిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకు న్నారని వివరించారు. అంతకు ముందు ఆమె కేవీపల్లె మండలం గ్యారంపల్లె రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న ఈ-క్రాప్‌ బుకింగ్‌, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. కార్యక్రమంలో పీలేరు ఏడీ రమణరావు, ఏవోలు శ్రావణి, రమాదేవి, కరుణాకర్‌రెడ్డి, ఏఈవో అల్తాఫ్‌, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:49:35+05:30 IST

Read more