జీతాల బకాయిలను వెంటనే చెల్లించండి

ABN , First Publish Date - 2022-10-12T05:09:56+05:30 IST

ప్రభుత్వం నుంచి తమ కు రావాల్సిన జీతాల పెండింగ్‌ బకాయిల ను వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మి కులు, గ్రీన అంబాసిడర్లు డిమాండ్‌ చేశారు.

జీతాల బకాయిలను వెంటనే చెల్లించండి

కలకడ, అక్టోబరు 11:ప్రభుత్వం నుంచి తమ కు రావాల్సిన జీతాల పెండింగ్‌ బకాయిల ను వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మి కులు, గ్రీన అంబాసిడర్లు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు మంగళవారం ఎంపీడీవో కార్యాల యంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సోమశేఖర్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో పారి శుధ్యం మెరుగునకు నిరంతరం శ్రమిస్తు న్నా ప్రతి నెల జీతాలు సక్రమంగా అందడం లేదని వాపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన దృష్ట్యా రూ.21 వేల కనీస వేతనా న్ని ఇవ్వాలన్నారు. ఈ నెల 19లోగా  సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామ న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి హరిప్రసాద్‌, నాయకులు నటరాజ, వెంకటేషు పాల్గొన్నారు.

Read more