-
-
Home » Andhra Pradesh » Kadapa » Pawan Kalyan Janavani in Tirupati on 21st mvs-MRGS-AndhraPradesh
-
AP News: 21న తిరుపతిలో పవన్ కళ్యాణ్ ‘జనవాణి’
ABN , First Publish Date - 2022-08-19T23:43:31+05:30 IST
Tirupati: తిరుపతిలో ఈ నెల 21వ తేదీ ‘జనవాణి’ (Janavaani) కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన (Janasena party) పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జనవాణి పోస్టర్ను విడుదల చేశాక

Tirupati: తిరుపతిలో ఈ నెల 21వ తేదీ ‘జనవాణి’ (Janavaani) కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన (Janasena party) పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జనవాణి పోస్టర్ను విడుదల చేశాక ఆయన మాట్లాడారు. జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తాజ్ హోటల్ నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు నిర్వహించే ర్యాలీలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పాల్గొంటారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల వినతులను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారని పేర్కొన్నారు. తిరుమల,తిరుపతి వాసుల సమస్యలపై వినతులు ఇప్పటికే అందాయని హరిప్రసాద్ తెలిపారు.