‘పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’

ABN , First Publish Date - 2022-12-13T00:14:16+05:30 IST

బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ రాజంపేట కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పేర్కొన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం గ్రామంలో సోమవారం బీజేపీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

‘పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’

సిద్దవటం, డిసెంబరు 12: బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ రాజంపేట కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పేర్కొన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం గ్రామంలో సోమవారం బీజేపీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు అమర్‌నాథ్‌శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రమే్‌షనాయుడు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. మండలంలో భూకబ్జాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అధికార పార్టీ నాయకులు కొందరు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారన్నారు. వాటిపై రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అదేవిధంగా అధికార పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు అమర్‌నాథ్‌శర్మ, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి బాలాజి, మండల ఉపాధ్యక్షులు ఆనందమోహన్‌, కిసాన్‌ మోర్చా మండల అద్యక్షులు రాజారెడ్డి, బీజేపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బీఏపీ సీనియర్‌ నాయకులు జీకే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:14:16+05:30 IST

Read more