పునాదిలో దొరికిన పంచలోహపు నాగుపాము ప్రతిమ

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

స్థానిక ఎల్‌ఎం కాంపౌండ్‌లోని చెన్నకేశవస్వామి ఆల యం సమీపంలో బుధవారం ఇంటి పునాది తవ్వుతుండగా పంచలోహపు నాగుపాము ప్రతిమ బయటపడింది.

పునాదిలో దొరికిన  పంచలోహపు నాగుపాము ప్రతిమ
పంచలోహపు నాగుపాము ప్రతిమ

ముద్దనూరు మే18: స్థానిక ఎల్‌ఎం కాంపౌండ్‌లోని చెన్నకేశవస్వామి ఆల యం సమీపంలో బుధవారం ఇంటి పునాది తవ్వుతుండగా పంచలోహపు నాగుపాము ప్రతిమ బయటపడింది. అయితే ఈ స్థలానికి ఎంతో చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. వివరాల్లోకెళితే... ఇక్కడి చెన్నకేశవస్వామి ఆలయం చాలా పురాతనమైనది. శ్రీకృష్ణదేవరాయలు పునరుద్ధరిం చిన ఆలయాల్లో ఇదొకటని ప్రతీతి. ఈ దేవాలయం సమీపంలోనే నాగుల కట్ట ఉండేదని అంటుంటారు.

 ఇప్పటికీ చెన్నకేశవస్వామి వద్దకు పెద్ద నాగుపా ము వస్తుందని వినికిడి. తవ్వకంలో బయటపడిన ప్రతిమ పడ గపై రంధ్రం ఉంది. ఐదు ఇంచుల పొడవుతో మూడున్నర తులం లోహ ప్రతిమను ప్రజలు చెన్నకేశవస్వామి ఆలయం వారికి అప్పగించారు. పురాతన చరిత్రగల ప్రదేశంలో దొరికిన పంచలోపు నాగుపాము ప్రతిమను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనాఉంది.

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST