ఆర్టీపీపీలో కొనసాగుతున్న ఆందోళనలు

ABN , First Publish Date - 2022-11-24T23:07:09+05:30 IST

ఆర్టీపీపీలో తమను రెగ్యులర్‌ చేయాలన్న డిమాండ్‌తో భూనిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.

ఆర్టీపీపీలో కొనసాగుతున్న ఆందోళనలు
పవర్‌హౌస్‌ మెయిన్‌గేటు వద్ద ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు

ఎర్రగుంట్ల, నవంబరు 24: ఆర్టీపీపీలో తమను రెగ్యులర్‌ చేయాలన్న డిమాండ్‌తో భూనిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. గురువారం భూనిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. వి.మహేశ్వరి, కే.లక్ష్మిదేవి, కే.శివమల్లేశ్వరి, ఏ.రాజేష్‌, పివీ రమణయ్య దీక్షలో కూర్చుకున్నారు. జెన్కో యాజమాన్యం స్పందించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కాంట్రాక్టు కార్మికులు పవర్‌హౌస్‌ మెయిన్‌గేట్‌ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు.

జెన్‌కో యాజమాన్యం తమ జీవితాల్లో చీకట్లు నింపి అంథకారంలోకి నెట్టుతోందని విమర్శించారు. ఈ ఆందోళనకు కార్మిక నేత లు మల్లేసుడు, వి.సుబ్బిరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసి తమకు మద్దతును తెలపాలని వినతి పత్రం ఇచ్చామని కాంట్రాక్టు జేఏసీ నేతలు తెలిపారు. తమ సంపూర్ణమద్దతు కాంట్రాక్టు కార్మికులకు ఉంటుందని తెలిపారన్నారు.

Updated Date - 2022-11-24T23:07:10+05:30 IST