-
-
Home » Andhra Pradesh » Kadapa » Officials inquiry into encroachments-NGTS-AndhraPradesh
-
పెద్దవంక ఆక్రమణలపై అధికారుల విచారణ
ABN , First Publish Date - 2022-10-05T05:48:52+05:30 IST
మద నపల్లె మండలం సీటీఎం గ్రామ పరిధిలోని పెద్దవంక ఆక్రమణపై అధికారులు మంగళవారం విచారణ చేశారు.

మదనపల్లె టౌన్, అక్టోబరు 4: మద నపల్లె మండలం సీటీఎం గ్రామ పరిధిలోని పెద్దవంక ఆక్రమణపై అధికారులు మంగళవారం విచారణ చేశారు. సీటీఎం-వాల్మీకిపురం మధ్య జాతీయ రహదారి పక్కన, మండల సరిహద్దులో ఓ వ్యక్తి తన పొలాన్ని ఎక్సకవేటర్‌తో చదును చేస్తూ ఈ భూమిలో వచ్చిన మట్టిని ట్రాక్టర్లతో సమీపంలోని పెద్దవంక పక్కన వున్న పొలంలో డంప్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మట్టి అంతా పెద్దవంకలో పడి పూడిపోతుండటం గ్రామస్థులు తహసీల్దార్ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్‌వో, వీఆర్‌ఏలు పెద్దవంక పూడి కపై పరిశీలించారు. సర్వే చేసి పెద్ద వంక విస్తీర్ణాన్ని నిర్ణయిస్తారని, అంత వరకు వంక పక్కన పనులు ఆపివే యాలని రైతుకు సూచించారు. తహ సీల్దార్ మాట్లాడుతూ ఎలాంటి అను మతులు లేకుండా మట్టి రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుం టామన్నారు.