ఎరువుల దుకాణాలపై దాడులతో సరిపెడుతున్న అధికారులు

ABN , First Publish Date - 2022-10-09T04:27:12+05:30 IST

ఎరువులు, మందుల దుకాణాలపై విజిలెన్స అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ జిల్లా అధికారులు దాడులతోనే సరిపెడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి తెలిపారు.

ఎరువుల దుకాణాలపై దాడులతో సరిపెడుతున్న అధికారులు

కడప(సెవెనరోడ్స్‌), అక్టోబరు 8 : ఎరువులు, మందుల దుకాణాలపై విజిలెన్స అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ జిల్లా అధికారులు దాడులతోనే సరిపెడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి తెలిపారు. శనివారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత బయో కెమికల్స్‌ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, ఎరువులు, యదేచ్ఛగా రైతులను మోసం చేస్తూ విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వాటిపై విజిలెన్స ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు ప్రతి సంవత్సరం దాడులు చేస్తున్నారే తప్ప వారి పై లైసెన్సులు రద్దు చేయడం గాని క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం గాని చేయలేదన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Read more