హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-11-24T23:46:39+05:30 IST

పులివెందుల పోలీసుస్టేషనలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు ఎస్‌.బాబా ఫకృద్దీన (హెచజి 820) కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ కేకేఎన అన్బురాజన పేర్కొన్నారు.

హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం

రూ.10లక్షల ప్రమాద బీమా చెక్కు అందించిన ఎస్పీ

కడప (క్రైం), నవంబరు 24 : పులివెందుల పోలీసుస్టేషనలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు ఎస్‌.బాబా ఫకృద్దీన (హెచజి 820) కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ కేకేఎన అన్బురాజన పేర్కొన్నారు. గురువారం బాబా ఫకృద్దీన సతీమణి షేక్‌ షమీమ్‌కు రూ.10లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే హోంగార్డు రోడ్డు అకాల మరణం పొందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ1 జూనియర్‌ అసిస్టెంట్‌ అరుణ, పో లీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్‌, జిల్లా జాయింట్‌ సెక్రటరీ రఘునాధరెడ్డి, ఈసీ మెంబరు ఏప్రిన, సభ్యులు ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:46:39+05:30 IST

Read more