ప్రజలెవరూ బయటకు రావద్దు

ABN , First Publish Date - 2022-12-09T23:38:05+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజలెవరూ బయటకు రావద్దు

సబ్‌ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 9: బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు వాగులు, వంకలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాగులు పొంగుతున్న క్రమంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లడం, వాగులు, వంకలు దాటడం లాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు:

ఫ కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ : 08561-293006

ఫ రాయచోటి డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌: 9440407003

ఫ రాజంపేట డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌: 8712349929

ఫ మదనపల్లె డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌: 9849904116

Updated Date - 2022-12-09T23:38:08+05:30 IST