ఏపీకార్ల్‌లో పరిశోధనలకు న్యూటెక్‌ బయోసైన్సెస్‌ ఎంఓయూ

ABN , First Publish Date - 2022-07-06T05:02:11+05:30 IST

పులివెందులలోని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)లో పరిశోధనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మరియు న్యూటెక్‌ బయోసైన్సెస్‌ ఎంఓయూ కుదుర్చుకుంది.

ఏపీకార్ల్‌లో పరిశోధనలకు న్యూటెక్‌ బయోసైన్సెస్‌ ఎంఓయూ

పులివెందుల, జూలై 5: పులివెందులలోని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)లో పరిశోధనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మరియు న్యూటెక్‌ బయోసైన్సెస్‌ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య జీఓఎంఎస్‌ నెంబర్‌ 18ను విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ ఫీడ్‌ సంకలినతాల పరిశోధన, అభివృద్ధి మరియు ఉత్పత్తి కోసం సౌకర్యాన్ని ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా న్యూటెక్‌ బయోసైన్స్‌ ఏపీకార్ల్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేసిందన్నారు. డెయిరీ మరియు ఫౌల్ర్టీలను తయారు చేసే ఫీడ్‌ మిల్లులకు పోషకాహార సప్లిమెంట్‌లను తయారీ, పంపిణీ చేయడానికి మరియు ఆక్వాఫీడ్‌లపై పరిశోధనలు చేయనుందన్నారు. ఇందుకు గాను సంస్థ రూ.50కోట్ల పెట్టుబడి పెట్టనుందన్నారు. ఏపీకార్ల్‌లో పులివెందులలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను మరియు నిర్మించడానికి కూడా అంగీకరించాయన్నారు. న్యూటెక్‌ బయోసైన్సెస్‌ సంస్థ పరిశోధనలకై ఏపీకార్ల్‌లో సౌకర్యాల కోసం 10ఎకరాల భూమి ని అడిగినట్లు ఏపీకార్ల్‌ సీఈఓ డాక్టర్‌ వై.రమణారెడ్డి తెలిపారు. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి పరిశోధనలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

 

Read more