నేత్రపర్వంగా భద్రావతి, భావనారాయణ స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-11-20T23:25:39+05:30 IST

రామేశ్వరంలోని భద్రావతి,భావనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు.

 నేత్రపర్వంగా భద్రావతి, భావనారాయణ స్వామి కల్యాణం
రామేశ్వరంలో భద్రావతిభావనారాయణస్వామి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 20 : రామేశ్వరంలోని భద్రావతి,భావనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.లక్ష్మీదేవి తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు మేరువ పెంచలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు నందం కుమార్‌, ఉపాధ్యక్షుడు చెన్నా వెంకటకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి సోము జానకిరామయ్య, కోశాధికారి గునిశెట్టి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:25:55+05:30 IST

Read more