స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు నేతాజీ

ABN , First Publish Date - 2022-01-24T04:29:58+05:30 IST

నేతాజీ సుభా్‌ష చంద్రబోస్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు.

స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు నేతాజీ
నేతాజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తులసిరెడ్డి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

వేంపల్లె, జనవరి 23: నేతాజీ సుభా్‌ష చంద్రబోస్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. ఆదివారం వేంపల్లెలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ సుభాష్‌ చంద్రబోస్‌ 1938, 1939 సంవత్సరాలలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారన్నారు. ఆయన తన జీవితమంతా భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించేటందుకు అహర్నిశలు పాటుపడ్డారన్నారు. ఆనాడు వారు స్వరాజ్యం కోసం పోరాడితే, నేడు మనం సురాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రామకృష్ణ, నరసింహారెడ్డి, ఉత్తన్న, అమర్‌, నాగరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

Read more