పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే పద్ధతులకు స్వస్తిపలకండి

ABN , First Publish Date - 2022-12-13T23:28:01+05:30 IST

పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే పద్ధతులకు స్వస్తిపలకాలని ఎనఆర్‌సీ జాయింట్‌ యాక్షన కమిటీ కన్వీనర్‌ స య్యద్‌ బాబుబాయ్‌ పేర్కొన్నారు.

పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే పద్ధతులకు స్వస్తిపలకండి

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 13: పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే పద్ధతులకు స్వస్తిపలకాలని ఎనఆర్‌సీ జాయింట్‌ యాక్షన కమిటీ కన్వీనర్‌ స య్యద్‌ బాబుబాయ్‌ పేర్కొన్నారు. మం గళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన వి లేకరుల సమావేశంలో ఆయన మా ట్లా డారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఓబీసీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రతి యేటా ఇస్తున్న స్కాలర్‌షిప్పులను నిలిపేయడం దారుణమన్నారు. మౌ లానా అబుల్‌ కలాం ఆజాద్‌ మైనార్టీ ఫెలోషి్‌పను కూడా బలహీన వర్గాల విద్యార్థులకు నిలుపుదల చేయడం బాధాకరమన్నారు. దీని వల్ల ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌ప్సతో పాటుగా ఆయా వర్గాలను ఉన్నత స్థాయి విద్యకు కూడా దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన స్కాలర్‌షిప్పులను పునరుద్ధరింపజేయాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆప్‌కా ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మగ్బుల్‌బాష, ఏఐఎ్‌సఎఫ్‌ నగర కార్యదర్శి సుబ్బరాయుడు, న్యాయవాది అలీఖాన , నాయకులు హిదయతుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:28:04+05:30 IST