రోజుకు రూ.257 వచ్చేలా పని చేయాలి

ABN , First Publish Date - 2022-06-08T05:19:15+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద పను లు చేసే కూలీలు రోజుకు 257 రూ పాయలు వచ్చేలా పని చేయాలని డ్వామా పీ డీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు.

రోజుకు రూ.257 వచ్చేలా పని చేయాలి
పనులను పరిశీలిస్తున్న డ్వామా పీడీ

మైదుకూరు, జూన్‌ 7 : ఉపాధి హామీ పథకం కింద పను లు చేసే కూలీలు రోజుకు 257 రూ పాయలు వచ్చేలా పని చేయాలని డ్వామా పీ డీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డయాంఖాన్‌పల్లెలో మంగళవారం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఏపీవో లక్ష్మీనారాయణతో మాట్లాడుతూ కూలీలకు రోజుకు 257 రూపాయలు వచ్చేలా పను లు చేయించాలని తెలిపారు. అలాగే అన్నలూరులో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సూర్య ప్రకాష్‌ రావు పాల్గొన్నారు. 

Read more