రౌడీషీటర్‌ శివశంకర్‌రెడ్డిపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-12-09T23:45:40+05:30 IST

కురబలకోట మం డలం మట్లివారిపల్లె పంచాయతీ వనంరెడ్డిగారిప ల్లెకు చెందిన రౌడీషీటర్‌ శివశంకర్‌రెడ్డి అలియాస్‌ శివారెడ్డి(30)పై గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగ ళూరులో హత్యాయత్నం జరిగింది. తన వాహన డ్రైవర్‌ అశోక్‌రెడ్డితో కలిసి బెంగళూరులోని కృష్ణరా జపురంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లా డు.

రౌడీషీటర్‌ శివశంకర్‌రెడ్డిపై హత్యాయత్నం

బుల్లెట్‌ గాయాలతో బయటపడ్డ బాధితుడు

వాహన డ్రైవర్‌కూ గాయం

బెంగళూరులో ఘటన

మదనపల్లె(క్రైం), డిసెంబరు 9: కురబలకోట మం డలం మట్లివారిపల్లె పంచాయతీ వనంరెడ్డిగారిప ల్లెకు చెందిన రౌడీషీటర్‌ శివశంకర్‌రెడ్డి అలియాస్‌ శివారెడ్డి(30)పై గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగ ళూరులో హత్యాయత్నం జరిగింది. తన వాహన డ్రైవర్‌ అశోక్‌రెడ్డితో కలిసి బెంగళూరులోని కృష్ణరా జపురంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లా డు. ఆ సమయంలో వెంటాడుతూ రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఒక్క సారిగా శివశంకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డిలపై పిస్టళ్లతో కాల్పులు జరిపి పరారయ్యారు. కాగా ఆరురౌండ్లు కాల్పులు జరపడంతో బుల్లెట్లు శరీరంలోకి దూసు కెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికు లు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కృష్ణరాజపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

శివశంకర్‌రెడ్డిది ఆది నుంచీ నేరచరిత్రే..!

మండలంలోని ముదివేడు జడ్పీ హైస్కూల్లో శివశంకర్‌రెడ్డి టెన్త్‌ వరకు చదివాడు. తండ్రి జయచంద్రారెడ్డికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో తండ్రీ, కొడుకులు 2011లో భూవివాద గొడవల్లో భాగంగా గ్రామానికి చెందిన బయారెడ్డిని హత్య చేశారు. అ నంతరం 2012లో బయారెడ్డి బావమరిది, మండ లంలోని గౌనివారిపల్లెకు చెందిన నరసింహారెడ్డి మదనపల్లె మండలం ఐదో మైలు వద్ద జయచం ద్రారెడ్డిని హత్య చేశాడు. ఇందుకు ప్రతీకారంగా నరసింహారెడ్డిని శివశంకర్‌రెడ్డి హత్య చేశాడు. దీం తో 2013లో ముదివేడు పోలీసులు శివశంకర్‌రె డ్డిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. ఆ తర్వాత పలు కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. అనంతరం బెంగళూరుకు వెళ్లి బిల్డర్‌, రియల్టర్‌గా కొనసాగు తూ... అక్కడ కూడా రౌడీయిజాన్ని అడ్డు పెట్టుకు ని దందాలు, దౌర్జన్యాలకు పాల్పడేవాడు. దీంతో బెంగళూరులో పలు కేసులు నమోదు చేశారు. 2021లో ఎర్రసానిపల్లెలో జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు ధనేశ్వర్‌రెడ్డి అలియాస్‌ ధనను హత్య చేశాడు. ఈ హత్య అనంతరం శివశంకర్‌రెడ్డికి పలు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు బెంగ ళూరులో కొందరు వ్యక్తులు ఇతనిపై కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనను పరిశీలిస్తే.. పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణరాజపురం పోలీసులు శుక్రవారం ముదివేడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి శివశంకర్‌రెడ్డిపై ఉన్న కేసు లను పరిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు కర్ణాటక పోలీ సులు చెప్పారు. అదే విధంగా ధన అనుచరులను, బెంగళూరు, తమిళనాడుకు చెందిన ముఠా గ్యాంగ్‌లను సైతం స్టేషన్‌కు రప్పించి విచారిస్తు న్నట్లు తెలిసింది. కాగా శివశంకర్‌రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. శివశంకర్‌రెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుల వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Updated Date - 2022-12-09T23:46:07+05:30 IST