మున్సిపల్‌ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి

ABN , First Publish Date - 2022-07-19T04:38:46+05:30 IST

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని యూటీఎఫ్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి
మాట్లాడుతున్న సుబ్బరాజు యాదవ్‌

 ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 18 : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని యూటీఎఫ్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం హోమస్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో యూటీఎఫ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపల్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఎంఈఓ, ఉప విద్యాశాఖాధికారి దృష్టికి తెచ్చినా వారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించకపోతే 20వ తేదీ ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూటీఎఫ్‌ నాయకుడు రవీంద్రుడు, ఉపాధ్యాయులు నాగరాజు, మోహన్‌, సరళ, అరుణ, పార్వతి, లక్ష్మీదేవి, జయలక్ష్మి పాల్గొన్నారు.


Read more