మది పులకించేలా...

ABN , First Publish Date - 2022-09-19T05:48:21+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది.

మది పులకించేలా...
గాలి బండపై పర్యాటకుల సందడి

ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు

హార్సిలీహిల్స్‌లో సండే సందడి


బి.కొత్తకోట, సెప్టెంబరు 18 : ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. సాధారణంగా వారాంతపు రోజుల్లో పర్యాటకుల సందడి అధికంగానే ఉంటుంది. అయితే ఈ ఆదివారం మరింత అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో కొండ కిటకిటలాడింది. కొండపై అటవీశాఖ పరిధిలోని చిల్డ్రన్స్‌ పార్కు, మొసళ్ల పార్కు, టూరిజం సముదాయంలోని అడ్వెంచర్‌ పార్కు, స్విమ్మింగ్‌ పూల్‌, గవర్నర్‌ బంగ్లా ప్రాంతాలను సందర్శించారు గాలిబండ వ్యూపాయింట్‌ల వద్ద నుంచి చూస్తే కనిపించే ప్రకృతి అందాలు, కొండలు, లోయలు పర్యాటకులకు కనువిందు చేశాయి. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు బాగా కురుస్తుండడంతో కొండపైనా, కొండ చుట్టూ గల ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కొండపై నుంచి చూస్తే కనిపించే గుట్టలు, లోయలు, చెరువులతో కూడిన అందమైన లొకేషన్స్‌ పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపులా అడవి పూల అందాలు, పక్షుల కిలకిలరావాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

Read more