మాన్యాలున్నా.. నైవేద్యానికీ కరువే!

ABN , First Publish Date - 2022-08-17T04:30:52+05:30 IST

మాన్యాలున్నా పలు ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటేటా భూముల ద్వారా వస్తున్న ఆదాయాన్ని తన ఖాతా లో జమ చేసుకుంటున్న రాష్ట్ర దేవదాయ శాఖ ఆలయాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదనడానికి బీ. యర్రగుడి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది.

మాన్యాలున్నా.. నైవేద్యానికీ కరువే!
లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

లక్కిరెడ్డిపల్లె, ఆగస్టు 14: మాన్యాలున్నా పలు ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటేటా భూముల ద్వారా వస్తున్న ఆదాయాన్ని  తన ఖాతా లో జమ చేసుకుంటున్న రాష్ట్ర దేవదాయ శాఖ ఆలయాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదనడానికి బీ. యర్రగుడి గ్రామంలోని  లక్ష్మీనరసింహస్వామి ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. చోళుల కాలంనాటి ఈ ఆలయానికి   35 ఎకరాల మాన్యం ఉంది. ఏడాదికోసారి ఈ భూములను దేవదాయ శాఖ వేలం వేస్తు న్నా  ఇక్కడ పనిచేస్తున్న అర్చకుడికి మాత్రం ఇప్పటికీ నెలకు రూ.200 గౌరవ వేతనం మాత్ర మే ఇస్తున్నారు. ఈ మొత్తం ఎందుకూ చాలక పోవడంతో,   పౌరోహిత్యం చే యడం ద్వారా వచ్చిన ఆదాయంతో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నానని అ ర్చకుడు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయం క్రమేణా శిథిలావస్థకు చేరుకుంటోంది. పైకప్పు కారుతుండడంతో  ఉత్సవ విగ్రహాలను భద్రపరచడానికి కూడా స్థలం లేకుండా పో యిందని అర్చకుడు చెబుతున్నారు. గతంలో ఈ ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు. గుడి ఽశిథిలావస్థకు చేరుకోవడంతో రాను రాను భక్తులు రావడం మానేశారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-17T04:30:52+05:30 IST