ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-04T05:16:11+05:30 IST

మండల పరిధిలోని ఇడమడక వద్ద కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు దా టుతుండగా పెరుగు కృష్ణయ్య (43) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందాడు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

దువ్వూరు, అక్టోబరు 3: మండల పరిధిలోని ఇడమడక వద్ద కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు దా టుతుండగా పెరుగు కృష్ణయ్య (43) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందాడు.  దసరా ఉత్సవాల్లో భాగంగా ఇడమడక గ్రామంలో నిర్వహించిన భజనకు అదే గ్రామానికి చెందిన పెరుగు కృష్ణయ్య వెళ్లి  కాశినాయన గుడికి వెళుతుండగా చిత్తూరు నుంచి కర్నూలువైపునకు వెళుతున్న ఆర్టీసీ బస్సు కృష్ణయ్యను ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణయ్య తలకు తీవ్ర రక్తగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ కేసీ రాజు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా గ్రామస్థుడు మృతిచెందడంపట్ల ఇడమడక గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.


Read more