మల్లెంకొండేశ్వరస్వామి ఆదాయం రూ.10 లక్షలు

ABN , First Publish Date - 2022-03-05T04:58:22+05:30 IST

మహాశివరాత్రి సందర్భంగా మల్లెంకొండేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.10 లక్షలపైనే వచ్చినట్లు దేవదాయశాఖ అధికారులు ఈఓ రాధాకృష్ణ, ఆలయ పాలక మండ లి చైర్మన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

మల్లెంకొండేశ్వరస్వామి ఆదాయం రూ.10 లక్షలు
మల్లెంకొండేశ్వరస్వామి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం

గోపవరం, మార్చి 4: మహాశివరాత్రి సందర్భంగా మల్లెంకొండేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.10 లక్షలపైనే వచ్చినట్లు దేవదాయశాఖ అధికారులు ఈఓ రాధాకృష్ణ, ఆలయ పాలక మండ లి చైర్మన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం దేవదాయశాఖ అధికారులు బద్వేలులోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు.

మల్లెంకొండేశ్వరస్వామికి రూ.9,51,164లు ఆదాయం రాగా చదివింపుల ద్వారా రూ.56,212లు  వచ్చిందన్నారు. బంగారు 2 గ్రాముల 934 మిల్లీ గ్రాములు, వెండి 61 గ్రాముల 91 మిల్లీ గ్రాములు భక్తుల ద్వారా 745 గ్రాముల రెండు వెండి చెంబులు వచ్చాయన్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఆదాయం పెరిగిందన్నారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ శివయ్య, సాంబయ్య, రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Read more