విద్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-09-12T05:21:11+05:30 IST

రాష్ట్ర విద్యా శాఖలో పేరుకుపోయిన సమస్యల పరి ష్కారం కోరుతూ 13న రాయచోటిలో తలపెట్టిన విద్యాగ్రహ దీక్షను విజయ వంతం చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు పోలి శివకుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి
పీలేరులో సమావేశంలో మాట్లాడుతున్న శివకుమార్‌

పీలేరు, సెప్టెంబరు 11: రాష్ట్ర విద్యా శాఖలో పేరుకుపోయిన సమస్యల పరి ష్కారం కోరుతూ 13న రాయచోటిలో తలపెట్టిన విద్యాగ్రహ దీక్షను విజయ వంతం చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు పోలి శివకుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యాగ్రహ దీక్ష సన్నాహాల్లో భాగంగా ఆయన ఆదివారం పీలేరులోని టీఎన్‌ఎస్‌ ఎఫ్‌ శ్రేణులతో సమావేశమై మాట్లాడుతూ ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయ కుండా, విలీనం పేరిట ఉన్న పోస్టులు రద్దు చేయడం, సీపీఎస్‌పై మాట తప్పడం, హక్కుల కోసం ఉద్యమించిన ఉపాధ్యాయులపై అక్రమ కేసులు బనాయించడం, ఉపాధ్యాయురాళ్ల ఇళ్లకు రాత్రిళ్లు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేయడం చూస్తే ఉపాధ్యాయు రంగంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు.  13వ తేదీ ఉదయం 10 గంటలకు రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగే దీక్షలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఎన్టీఆర్‌ నఫీస్‌, ముబారక్‌, ఆవుల మహేశ్‌, మునీంద్రా, సాధిక్‌, ఇమ్రాన్‌, హేమాద్రి పాల్గొన్నారు. 


Read more