జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-09-14T04:41:10+05:30 IST

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని ఏడీజే భాస్కర్‌రావు కోరారు. మంగళవారం స్థానిక ఏడీజే కోర్టులో పోలీసులతో సమావేశం నిర్వహించారు.

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 13: జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని ఏడీజే భాస్కర్‌రావు కోరారు. మంగళవారం స్థానిక ఏడీజే కోర్టులో పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 12న మదనపల్లె కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నా మన్నారు. ఇందులో రాజీకుదిరే అన్నిరకాల కేసులను పరిష్కరిం చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలన్నారు. కక్షిదారులను రాజీకి ఒప్పించి, కేసుల పరిష్కారంలో లక్ష్యాలను చేరుకోవాలంటూ న్యాయమూర్తి సూచించారు. న్యాయ మూర్తులు వెంకటేశ్వర్లునాయక్‌, శ్రీనివాసులురెడ్డి, ఆసీఫాసుల్తానా, చలపతి, పోలీసులు, కోర్టుసిబ్బంది పాల్గొన్నారు.

Read more