పితృదీక్షతో సఖల శుభాలు

ABN , First Publish Date - 2022-09-12T05:28:05+05:30 IST

పితృదీక్షతో సఖల శుభాలు లభిస్తాయని రాషీ్ట్రయ బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాఽథ్‌శర్మ పేర్కొన్నారు.

పితృదీక్షతో సఖల శుభాలు

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 11: పితృదీక్షతో సఖల శుభాలు లభిస్తాయని రాషీ్ట్రయ బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాఽథ్‌శర్మ పేర్కొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన మహాలయ పక్షాలలో పితృ దేవతల దీక్షను  స్వీకరించారు. ఈ నెల 25న మహాలయ అమావాస్య రోజున పుష్పగిరిలోని పాదం వద్ద పితృదేవతల పిండ ప్రదానంతో దీక్ష ముగుస్తుందని ఆయన తెలిపారు.  

ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై కేసు అక్రమం

టీడీపీ ప్రొద్దుటూరు ఇనచార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై  పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం అక్రమమని కాశీభట్ల సత్యసాయినాథ్‌శర్మ అన్నారు. కమలాపురంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలీసులు వాస్తవాలను విచారించకుండా ఫిర్యాదు దా రుడి పూర్వపరాలు తెలుసుకోకుండా కేసు నమోదు చేయడం విచారకరమన్నారు.  

Read more