75 గంటల దీక్షను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-09-11T05:19:54+05:30 IST

కొండాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల కోసం సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిర్వహించనున్న 75 గంటల దీక్షను జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు తెలిపారు

75 గంటల దీక్షను జయప్రదం చేయండి

కొండాపురం, సెప్టెంబరు 10: కొండాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల కోసం సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిర్వహించనున్న 75 గంటల దీక్షను జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు తెలిపారు. ఇందుకు సంబం ధించి శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో వాల్‌పోస్టర్లను విడుదల చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ బ్రిటిష్‌ హయాం నుంచి ఉన్న పలు రైళ్ల స్టాపింగ్‌ను కరోనా సాకుతో ఎత్తివేశారన్నారు.  ఈ విషయం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఆందోళన చేసినా ఫలితం లేదన్నారు. దీంతో కొండాపురం రైల్వే స్టేషన్‌లో అన్ని రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఏరియా కార్యదర్శి ఎంవీ సుబ్బారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు సోమవారం నుంచి కొండాపురం రైల్వేస్టేషన్‌ ఆవరణలో 75 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ మండల అధ్య క్షుడు విద్యాసాగర్‌రెడ్డి, భవన నిరర్మాణ సంఘం నాయకులు వెంకటరమణ, ఎన్‌పీఎఫ్‌ అధ్యక్షులు నాగన్న, సీపీఐ నాయకులు జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more