ఆటోను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-11-20T23:41:40+05:30 IST

మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో కడప తాడిపత్రి జాతీయ రహ దారిపై ఆదివారం ఉదయం ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

ఆటోను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి
ఆటోను ఢీకొన్న లారీ

ముద్దనూరు నవంబరు 20: మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో కడప తాడిపత్రి జాతీయ రహ దారిపై ఆదివారం ఉదయం ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఎస్‌ఐ చంద్రమోహన్‌ సమాచారం మేరకు వివరాలిలా.. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన సరస్వతికి అనార్యోగంగా ఉండటంతో నాటు వైద్యం కోసం కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి ఆటోలో వెళ్లారు. వైద్యం చేయించుకొని ఆటోలో ముగ్గురు వ్యక్తులు తిరిగి వస్తుండగా చెన్నారెడ్డిపల్లె వద్దకు రాగానే గుంటూరు జిల్లా వినుకొండ నుంచి తాడిప్రతికి వెళుతున్న లారీ ఎదురుగా ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సరస్వతి(36), ఆమె భర్త సిరంగి దస్తగిరి(45) అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్‌ ప్రేమ్‌కుమార్‌(35)ను 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ చంద్రమోహన్‌ ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-20T23:41:40+05:30 IST

Read more