మద్యం షాపును ఎత్తేయండి

ABN , First Publish Date - 2022-09-26T04:55:44+05:30 IST

రాజంపేట పట్టణానికి సమీపంలోని భువనగిరిపల్లెలో గుడికి, బడికి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని మహిళలు ఆదివారం ఆందోళన చేశారు.

మద్యం షాపును ఎత్తేయండి
పోలీసులతో వాగ్వాదం చేస్తున్న భువనగిరిపల్లె మహిళలు

భువనగిరిపల్లె మహిళల ఆందోళన 


రాజంపేట, సెప్టెంబరు 25 : రాజంపేట పట్టణానికి సమీపంలోని భువనగిరిపల్లెలో గుడికి, బడికి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని మహిళలు ఆదివారం ఆందోళన చేశారు. ప్రతిరోజూ మందుబాబుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, గ్రామంలో ప్రశాంతత లేదని పేర్కొంటూ మహిళలు బ్రాందీషాపు వద్ద పెద్దఎత్తున ఆందోళన చేశారు. మందుబాబులతో మానసిక వేదనకు గురవుతున్నామని, ప్రతిరోజూ ఇక్కడ మద్యం తాగి ఇబ్బందుల పాలు చేస్తున్నారని వెంటనే ఇక్కడి నుంచి షాపును తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళలకు ఇబ్బందికలగజేస్తున్న ఈ మద్యం దుకాణ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. 

Read more