వాల్మీకి ముదిరాజ్‌ ఐక్యవేదిక కోసం నడుద్దాం

ABN , First Publish Date - 2022-11-11T22:53:31+05:30 IST

వాల్మీకి ముదిరాజ్‌ ఐక్యవేదిక కోసం కలిసికట్టుగా నడవాలని కర్నూల్‌ జోన్‌ హోంగార్డు ఎస్పీ మహే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు.

వాల్మీకి ముదిరాజ్‌ ఐక్యవేదిక కోసం నడుద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న కర్నూల్‌ జోన్‌ హోంగార్డు ఎస్పీ మహే్‌షకుమార్‌

లక్కిరెడ్డిపల్లె, నవంబరు11: వాల్మీకి ముదిరాజ్‌ ఐక్యవేదిక కోసం కలిసికట్టుగా నడవాలని కర్నూల్‌ జోన్‌ హోంగార్డు ఎస్పీ మహే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం దేవళంపల్లె చెన్నకేశవస్వామి ఆలయంలో వాల్మీకి ముదిరాజ్‌ ఐక్యవేదిక కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ వాల్మీకులు తమ పిల్లలను మంచి విద్యావంతులు చేయాలని ఆయన సూచించారు. ముందుగా మానవత విలువలను పిల్లలకు నేర్పించాలని వాల్మీకి పిల్లలను చదివించాలన్నారు. సమాజంలో వాల్మీకి కులాలు అట్టడుగు ఉన్నాయని, ముదిరాజ్‌ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు.

లక్కిరెడ్డిపల్లె వాల్మీకి ముదిరాజ్‌ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం నిర్వహించి చెన్నకేశవస్వామికి పూజలు నిర్వహించారు. సీఐ వరప్రసాద్‌, జిల్లా వాల్మీకి ముదిరాజ్‌ సంఘం నేతలు రామచంద్రయ్య, మండ్ల రామాంజనేయులు, విజయభాస్కర్‌, వీఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల యోగానందబాబు(బుజ్జిబాబు), వాల్మీకి సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు యోగి రెడ్డెప్ప, రాజేంద్రబాబు, మూగి వెంకట్రమణ, రామసముద్రం దొడ్డిపల్లె సర్పంచ్‌ ఆనంద్‌, మానవహక్కుల జిల్లా అవగాహన సదస్సు అధ్యక్షుడు చలపతి, కొర్లకుంట కృష్ణయ్య, సర్పంచ్‌ కేశవయ్య, శ్రీరాములు, రాజేస్‌, డీబీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T22:53:31+05:30 IST

Read more