‘ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం’

ABN , First Publish Date - 2022-11-23T23:08:37+05:30 IST

కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పిఎల్‌. నరసింహులు పిలుపు నిచ్చారు.

‘ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం’

బి.కొత్తకోట నవంబరు 23 : కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పిఎల్‌. నరసింహులు పిలుపు నిచ్చారు. బుదవారం బి.కొత్తకోటలోని పిండుకూరి ఫంక్షన హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృధ్ది కుంటుపడడంతోపాటు, అప్పులపాలైందని ఆరోపించారు. రాష్ట్రంలో నియంత పరిపాలన జరుగుతున్నదని, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు ఆకా శాన్నంటాయని, దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, ప్రతి ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు హామి గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 7న రాయచోటిలో నిర్వహిస్తున్న అన్నమయ్య జిల్లా సీపీఐ జనరల్‌ బాడీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య హాజరవుతున్నారన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎమ్‌. సాంబశివ, సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి ఎస్‌. మనోహర్‌ రెడ్డి, మండల కార్యదర్శి ఎస్‌. సలీంబాషా, సీపీఐ నాయకులు బషీర్‌ఖాన, బి. వేణుగోపాల్‌ రెడ్డి, ఎం. అష్రఫ్‌అలీ, ఎస్‌. తంబయ్యశెట్టి, ఎస్‌. జవహర్‌బాబు, గంగులప్ప, ఎచ. షమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:08:41+05:30 IST