ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం

ABN , First Publish Date - 2022-10-01T05:27:51+05:30 IST

మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి తెలిపారు.

ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం
బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి తదితరులు

 జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి
కొండాపురం, సెప్టెంబరు 30:
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి తెలిపారు. మండలంలోని మురుగంపల్లె, ఎస్‌.కొత్తపల్లె, సంకేపల్లె గ్రామాలలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, గండ్లూరు నాగేశ్వరరెడ్డి, కోటా ఓబుళరెడ్డి, నరసింహారెడ్డి, గోపాల్‌, కోటా బ్రదర్స్‌, అరుణ్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more