సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం

ABN , First Publish Date - 2022-08-09T05:26:04+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం
పీటీఎంలో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులు

వాల్మీకిపురం, ఆగస్టు 8: దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వాల్మీకిపురం నాయక్‌వీధిలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టి సమరయోధులకు జోహార్లు పలికారు.  కార్యక్రమంలో ఎంపీడీవో షబ్బీర్‌ అహ్మద్‌, ఈవో ఉదయ్‌కుమార్‌, ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాసులు, ఉపసర్పంచ్‌ కేశవరెడ్డి, నాయకులు నీళ్ల భాస్కర్‌, చికెన్‌ మస్తాన్‌, కలీమ్‌, సైఫుల్లా, రహంతుల్లా, మహబూబ్‌బాషా, రవి, రఘు, షాహిద్‌ పాల్గొన్నారు. 

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ ర్యాలీ 

పెద్దతిప్పసముద్రం ఆగస్టు 8 : ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగం గా సోమవారం మండల కేంద్రమైన పీటీఎంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.  జాతీయ జెండాలు చేత పట్టుకుని బోలో భారత్‌ మాతకీ జై అంటూ నినాదాలు చేశారు. హార్‌ ఘర్‌ ఘర్‌ తిరంగ్‌ జాగృతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించాలని  కోరారు.  కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం నాగేంద్ర ప్రసాద్‌, ఉపాధ్యాయులు విద్యార్థులున్నారు. 

గుర్రంకొండలో: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో భాగం గా సోమవారం గుర్రంకొండలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థు లు ర్యాలీ నిర్వహించారు.  అనంతరం కోటలో చెత్త, చెదారాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటరమణ, రంగారెడ్డి, ఎండీ.జమీర్‌, కోట సిబ్బంది రామూర్తి, శేఖర్‌లు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు జాతీయభావంతో మెలగాలి

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 8: దేశంలో ప్రతి ఒక్కరు జాతీయభావంతో మెలగాలని పోస్టల్‌ ఏఎస్పీ కె.విద్యావతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక హెడ్‌పోస్టాఫీసు నుంచి తపాలశాఖ ఉద్యోగులు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విద్యావతి మాట్లాడు తూ స్వాతంత్య్రదినోత్సవం 76వ సారి నిర్వహిస్తున్న సందర్భంగా పోస్టా ఫీసుల్లో జాతీయ జెండాలు విక్రయిస్తున్నామన్నారు. ప్రజలు ప్రతి ఇం టిపై జాతీయజెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హెడ్‌పోస్టాఫీసు నుంచి జాతీయపతాకాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమంలో పోస్టల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:26:04+05:30 IST