సందేహాలు ఉంటే తెలియజేయండి

ABN , First Publish Date - 2022-10-01T04:50:53+05:30 IST

మండలంలో 12 కిలోమీటర్ల మేర హైవే వస్తున్నందున 141 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారని వీటిపై సందేహాలుంటే తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్సారి యా పేర్కొన్నారు.

సందేహాలు ఉంటే తెలియజేయండి
రైతుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పుల్లంపేట, సెప్టెంబరు30: మండలంలో 12 కిలోమీటర్ల మేర హైవే వస్తున్నందున 141 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారని వీటిపై సందేహాలుంటే తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్సారి యా పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీఓ సభాభవనం, రెడ్డిపల్లె సచివా లయంలో భూములు కోల్పోయిన రైతులతో జేసీ సమావేశమయ్యారు. మార్కెట్‌ రేటు ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుందని, అదనంగా పొలంలో చెట్లకు నష్ట పరిహారం వస్తుంద న్నారు. పరిహారంపై సందేహాలు ఉంటే తెలియజేయాలన్నారు. అనంత రం జేసీ పుల్లంపేట సచివాలయాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కోదండరామిరెడ్డి, తహసీల్దారు నరసింహకుమార, సర్పంచ్‌ ఆకేపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Read more