కలసికట్టుగా రాజ్యాధికారం సాధిద్దాం

ABN , First Publish Date - 2022-07-04T05:21:44+05:30 IST

తొగట వీర క్షత్రియులు కలిసికట్టుగా రాజ్యాధికారం సాధించే దిశగా పయనిద్దా మని తొగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోడెం వీరాంజనేయప్రసాద్‌, బొమ్మిశెట్టి కృష్ణమూర్తి అన్నారు.

కలసికట్టుగా రాజ్యాధికారం సాధిద్దాం
మాట్లాడుతున్న తొగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయప్రసాద్‌

 తొగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు 

మదనపల్లె అర్బన్‌, జూలై 3: తొగట వీర క్షత్రియులు కలిసికట్టుగా రాజ్యాధికారం సాధించే దిశగా పయనిద్దా మని తొగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోడెం వీరాంజనేయప్రసాద్‌, బొమ్మిశెట్టి కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం తొగట వీర క్షత్రియ రాష్ట్ర సంఘంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధ్యక్ష, కార్యదర్శుల సన్మానసభను మదనపల్లెలోని చౌడేశ్వరీదేవి కల్యాణమండపంలో నిర్వహించారు. ముందుగా తమ కుల గురువు దివ్యాజ్ణాననంద స్వామికి చౌడేశ్వదేవి ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  తొగట కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రమణమ్మ, రమేష్‌ తదితరులు గజమాలతో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. తొగటవీరుల ఇలువేల్పు దైవమైన చౌడేశ్వరీదేవి ఆలయాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించాలని సంఘం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగానే 50 ఆలయాలకు చేయూతనివ్వాలని మెదటగా 10 ఆలయాలు మొదలు పెట్టామన్నారు. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, వెయ్యిమంది వృద్ధులకు ఆశ్రయం కల్పించేలా వృద్ధాశ్రమం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, తొగట వీరక్షత్రియ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బండార రఘురామయ్య, రాష్ట్ర నాయకులు చింతల శ్రీనివాసులు, కనుముల శ్రీనివాసరావు, మల్లయ్య, వివిధ జిల్లాల అధ్యక్షులు, మహిళా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీలత, రేణుక, మదనపల్లె సంఘం అధ్యక్షుడు ఉప్పురామచంద్ర, సెక్రటరీ రామిశెట్టి లోకేష్‌, ట్రెజరర్‌ ప్రభాకర్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T05:21:44+05:30 IST