సమస్యలను సత్వరం పరిష్కరించాలి: కమిషనర్‌

ABN , First Publish Date - 2022-12-12T23:33:49+05:30 IST

సమస్యలను సత్వరం పరిష్కరించాలని కమిషనర్‌ కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు.

సమస్యలను సత్వరం పరిష్కరించాలి: కమిషనర్‌

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 12 : సమస్యలను సత్వరం పరిష్కరించాలని కమిషనర్‌ కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్‌ స్పందన హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందనలో 22 అర్జీలు వచ్చాయన్నారు. వాటిలో ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి 5, టౌన్‌ ప్లానింగ్‌ 4, యుపీఏ విభాగానికి సంబంధించి 3, రెవెన్యూ 2, ఎష్టాబ్లి్‌షమెంట్‌ 2, కడప తహసీల్దారు 2, సీకేదిన్నె తహసీల్దారు 1, మెప్మా విభాగం 1, ఏపీఎస్పీడీసీఎల్‌ 1 అర్జీలు ఉన్నాయన్నారు. వచ్చిన అర్జీలన్నీంటినీ పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించామని, వచ్చే సోమవారం లోపు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశించారు.

Updated Date - 2022-12-12T23:33:49+05:30 IST

Read more