దూర విద్య సెల్ఫ్‌ సెంటర్లను రద్దు చేయాలి: ఏపీఎ్‌సయూ

ABN , First Publish Date - 2022-11-24T23:51:36+05:30 IST

వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని దూర విద్య పరీక్షలు డిసెంబరు 8 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెల్ఫ్‌ సెంటర్లను రద్దు చేయాలని ఏపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జయవర్ధన డిమాండ్‌ చేశారు.

దూర విద్య సెల్ఫ్‌ సెంటర్లను రద్దు చేయాలి: ఏపీఎ్‌సయూ

కడప (ఎడ్యుకేషన), నవంబరు 24 : వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని దూర విద్య పరీక్షలు డిసెంబరు 8 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెల్ఫ్‌ సెంటర్లను రద్దు చేయాలని ఏపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జయవర్ధన డిమాండ్‌ చేశారు. గురువారం కడప నగరం ఏపీఎ్‌సయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సెంటర్ల పేరుతో విద్యార్థుల నుంచి యాజమాన్యాలు వేలాది రూపాయలు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయన్నారు. తక్షణం సెల్ఫ్‌సెంటర్లను రద్దు చేయకుంటే ఏపీఎ్‌సయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2022-11-24T23:51:36+05:30 IST

Read more