-
-
Home » Andhra Pradesh » Kadapa » Leopard in fields people in panic-MRGS-AndhraPradesh
-
పొలాల్లో చిరుత - భయాందోళనలో ప్రజలు
ABN , First Publish Date - 2022-10-03T05:01:19+05:30 IST
శెట్టివారిపల్లెలో చిరుతపులి సంచరిస్తుందని ప్రజలు నెలరోజులుగా భయాందోళన చెందుతున్నా అటవీ అధికారు లు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అడుగులను పరిశీలించిన అటవీ అధికారులు
ముద్దనూరు అక్టోబరు2: శెట్టివారిపల్లెలో చిరుతపులి సంచరిస్తుందని ప్రజలు నెలరోజులుగా భయాందోళన చెందుతున్నా అటవీ అధికారు లు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పది రోజుల కిందట పాఠశాల సమీప పొలాల్లో రైతులకు చిరుతపులి కన్పించడం తో భయాందోళన చెం దారు. ఈ విషయం పత్రికల ద్వారా అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యం వహించారు. ఆదివారం అటవీ అధికారులకు రైతులు విన్నవించుకో వడంతో వారు వచ్చి పులి అడుగులను పరిశీలించారు. గతేడాది రెం డేళ్ల పులి పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి చనిపోయిన విషయం విదితమే.
