పనుల్లో నాణ్యత లోపం.. జేసీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-13T23:25:18+05:30 IST

సి ద్దవటం మండలం ఉప్పర ప ల్లె గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జాయింట్‌ కలె క్టర్‌ సాయికాంత్‌వర్మ ఆకస్మి కంగా తనిఖీ చేశారు.

 పనుల్లో నాణ్యత లోపం.. జేసీ ఆగ్రహం
డాక్టర్‌ శివకుమార్‌తో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

సిద్దవటం, డిసెంబరు 13: సి ద్దవటం మండలం ఉప్పర ప ల్లె గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జాయింట్‌ కలె క్టర్‌ సాయికాంత్‌వర్మ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. నాడు -నేడు పనులను పరిశీ లించా రు. ఆసుపత్రి స్లాబ్‌ కారుతుం డడంతో, ఇంజనీరింగ్‌ అధికారులు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం పి. కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్‌ శంకర్‌రావు ఇన్‌చార్జి ఎంపీడీవో పులిరాంసింగ్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, డీఈ శేషావలి, డాక్టర్‌ శివకుమార్‌, వీఆర్వో గౌస్‌ బాషా, సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సుబ్బరాయుడు, సర్వేయర్‌ కరీముల్లా, ఆర్‌అండ్‌బి సిబ్బంది, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట: తహసీల్దార్‌ కార్యాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. భూ సమస్యలను వెంటనే పరిష్క రించాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, డీటీ లవన్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:25:18+05:30 IST

Read more