ముక్కోటికి ముస్తాబైన కోదండరామాలయం

ABN , First Publish Date - 2022-12-30T22:38:59+05:30 IST

ఏకశిలా నగిరి కోదండరామాల యంలో ముక్కోటిని పురస్కరించుకుని ఏర్పాట్లను ము మ్మరంగా చేపడుతున్నారు.

ముక్కోటికి ముస్తాబైన కోదండరామాలయం

ఒంటిమిట్ట, డిసెంబరు30: ఏకశిలా నగిరి కోదండరామాల యంలో ముక్కోటిని పురస్కరించుకుని ఏర్పాట్లను ము మ్మరంగా చేపడుతున్నారు. జనవరి 2న సోమవారం ము క్కోటి సందర్భంగా రామాలయానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలుగా రామాలయం చుట్టూ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, తీర్ధప్రసాదాలను ఏర్పా టు చేయాలని టీటీడీ ఇంజనీరింగ్‌ అధికారులు నిర్ణయిం చడంతో ఆ దిశగా ఏర్పాట్లను చేపట్టారు.

నూతన సంవ త్సరం ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజర వుతారనే ఉద్దేశంతో ముందస్తుగానే ముక్కోటికి ముందు గానే ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. రామాలయానికి ప్రత్యేకంగా పూలతో అలంకరించాలని టీటీడీ అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. అధికా రిక అనుమతులు అందిన వెంటనే పూర్తి స్థాయిలో అలం కరణ చేపడతామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

కోదండ రామాలయంలో ముక్కోటిని పురస్కరించుకుని భక్తుల కోసం ఉచిత అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించా లని టీటీడీ అధికారులు నిర్ణయించారు. రామకుటీరంలో తాత్కాలికంగా భక్తుల కోసం ఏర్పాట్లును టీటీడీ ఇంజనీ రింగ్‌ అధికారులు చేపడుతున్నారు. తాత్కాలిక ప్రాతిపది కన సిబ్బందిని కేటాయించారు. రామాలయానికి వచ్చే భక్తులకు సమయానికి అన్నప్రసాదం అందించనున్నారు.

Updated Date - 2022-12-30T22:39:00+05:30 IST