శేషవాహనంపై కోదండరాముడు

ABN , First Publish Date - 2022-04-06T05:25:11+05:30 IST

పట్టణంలోని సొసైటీకాలనీలో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఽశేషవాహనంపై కోదండ రాముడు ఊరేగుతూ భక్తులకు దర్శనమి చ్చారు.

శేషవాహనంపై కోదండరాముడు
శేషవాహనంపై ఊరేగుతున్న కోదండరామస్వామి

మదనపల్లె అర్బన,ఏప్రిల్‌ 5: పట్టణంలోని సొసైటీకాలనీలో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఽశేషవాహనంపై కోదండ రాముడు   ఊరేగుతూ భక్తులకు  దర్శనమి చ్చారు. ఉదయాన్నే స్వామివారికి పంచా మృత అభిసేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. అధికసంఖ్యలో భక్తులు స్మామివారిని ధర్శించుకున్నారు.  సాయంత్రం ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి స్వామివారిని ప్రత్యేకంగా అలం కరించి ప్రత్యేకంగా శేషవాహనంపై ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమాలను శ్రీరామసేవా ఉత్సవ కమిటీసభ్యులు పర్యవేక్షించారు. 


Read more