కొడాలి నానీ గతాన్ని గుర్తుతెచ్చుకో..

ABN , First Publish Date - 2022-09-13T05:40:28+05:30 IST

టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఎది గిన కొడాలి నాని గతాన్ని గుర్తుచేసుకో..లేకుంటే టీడీపీనే నీకు పాతర వేస్తుందని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగ రాజు హెచ్చరించారు.

కొడాలి నానీ గతాన్ని గుర్తుతెచ్చుకో..
మాట్లాడుతున్న టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి త్యాగరాజు

 టీడీపీ అనుబంధ సంఘ నాయకుల ధ్వజం

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 12: టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఎది గిన కొడాలి నాని గతాన్ని గుర్తుచేసుకో..లేకుంటే టీడీపీనే నీకు పాతర వేస్తుందని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగ రాజు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఆయన మీడి యాతో మాట్లాడుతూ బతుకునిచ్చిన కన్నతల్లిలాంటి పార్టీని, చంద్ర బాబునాయుడుపై కొడాలి నాని అనుచిత వాఖ్యలు చేయడం తగదన్నారు. అతని భాష మార్చుకోకుంటే టీడీపీ కార్యకర్తలే  తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. కార్య క్రమంలో టీడీపీ నాయకుడు చంద్రశేఖ ర్‌నాయుడు, టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ ప్రభాకర్‌, వెంకటరమణారెడ్డి, రెడ్డెప్ప, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

చీడపురుగును జగన్‌ రెచ్చగొడుతున్నాడు

తెలుగుదేశం పార్టీలో టికెట్‌ పొంది చీడపురుగులా మారి వైసీపీలో చేరి మంత్రి పదవి వెలగబెట్టి బూతుల మంత్రిగా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నానిని సీఎం జగన్‌ రెచ్చగొడుతూ చంద్రబాబు కుటుం బీకులపై అవాకులు పేల్చుతున్నారని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్‌ ఆరోపించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధి రాక్షస భాష వాడుతున్నా రన్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో విజయమ్మ, శ్యామల, నవీన్‌, శ్రీనివాసులు, ప్రభాకర్‌, రామచంద్ర పాల్గొన్నారు.


ప్రభుత్వం  వెంటనే అరెస్ట్‌ చేయాలి

కురబలకోట, సెప్టెంబరు 12: టీడీపీ అధినేత నారా చంద్ర బాబునా యుడు, జాతీయ ప్రధానకార్యదర్శి  నారా లోకేష్‌ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నానిని వెంటనే అరెస్ట్‌ చేయాలని రాజం పేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌, రాజంపేట పార్లమెంట రీ తెలుగు యువత ప్రధానకార్యదర్శి అయూబ్‌ బాషాలు డిమాండ్‌ చేశారు. సోమవారం  విలేకరుల సమావేశంలో వారు మాట్లా డుతూ సీఎం జగన్‌ వద్ద మెప్పుపొందడానికి కొడాలినాని పిచ్చిపట్టిన ట్లుగా మాట్లాడుతున్నాడన్నారు.  కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, టీడీపీ నాయకులు రుద్రబాలకృష్ణ, వెంకటరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునా యుడు, మాజీ మంత్రి లోకేష్‌బాబులపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి న మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామిరెడ్డి తెలి పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబా బు, లోకేష్‌ల గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి లేద న్నారు. కొడాలి నాని ఇకనైనా మాట్లాడే పద్ధతి మార్చుకో వాలని లేదంటే తగిన గుణపా ఠం చెబుతామన్నారు.  కార్యక్రమంలో నాయకులు కుడుము శ్రీనివాసు లు, సుకుమార్‌, మస్తాన్‌, షమీవుల్లా, ఆంజినేయులు, రంజిత్‌, దేవుడు నాగరాజు, బీరంగి గోపి తదితరులు పాల్గొన్నారు.

Read more