ప్రజలతో మమేకమై బిజీబిజీగా కిశోర్‌

ABN , First Publish Date - 2022-09-29T05:49:14+05:30 IST

పీలేరు ఇన్‌చార్జీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి బుధవారం సాయంకాలంలో పట్టణంలో ప్రజలతో మమేకమై బిజీబిజీగా గడిపారు.

ప్రజలతో మమేకమై బిజీబిజీగా కిశోర్‌
టీ స్టాల్‌ వద్ద టీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుతున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, సెప్టెంబరు 28: పీలేరు ఇన్‌చార్జీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి బుధవారం సాయంకాలంలో పట్టణంలో ప్రజలతో మమేకమై బిజీబిజీగా గడిపారు. పలు టీ, కాఫీ షాపుల వద్ద కూచుని పిచ్చాపాటీ కబుర్లతో ఆకట్టుకున్నారు. అందరికీ టీలు, కాఫీలు ఆర్డరు చేసి తానూ కలిసి తాగుతూ పేరు పేరునా పలకరించారు. దీం తో దుకాణదారులంతా ఉబ్బితబ్బిబ్యయ్యారు.  మొదట గుండ కూడలిలో వున్న వైసీపీ నాయకుడు, మార్కెట్‌ కమిటీ డైరెక్టరు బుజ్జికి చెందిన టీ స్టాల్‌ వద్దకెళ్లగానూ బుజ్జి కిశోర్‌కుమార్‌ రెడ్డికి పూలమాల వేసి టీస్టాల్‌ వద్దకు ఆహ్వానించారు. అక్కడికి చేరుకున్న పలువురు వ్యాపారస్తులు, దుకాణదార్లతో కొంతసేపు పిచ్చాపాటీ మాట్లాడారు. చాలా రోజుల తరువాత ఇలా కూర్చోవడం ఆనందంగా వుందని కిశోర్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. తమ తాతల కాలం నుంచి వచ్చిన ఆనవాయితీ గురించి ఆ తరం వారితో చర్చించారు. అనంతరం రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఎంఐ షోరూం వద్దకు చేరుకుని అక్కడున్న ముస్లిం యువకులతో చాలాసేపు మాట్లాడారు. . ఇటీవల కలికిరికి వచ్చిన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ యువకులను పేరు పేరునా సన్మానించడానికి చొరవ తీసుకున్న కిశోర్‌కుమార్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత టీబీ రోడ్డులోనే వున్న వెంకట్రమణ కాఫీ షాపుకు వెళ్లి అందరితో కలిసి కాఫీ తాగారు. ఈ కార్యక్రమాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, మాజీ ఎంపీపీ నాగభూషణ రెడ్డి,  రమేష్‌ చెట్టి, చెంచురామయ్య, హేమాచారి, విజయకుమార్‌రెడ్డి, అబ్దుల్‌ ఖాదర్‌, సనావుల్లా, అఫ్రోజ్‌ బాషా, అన్సర్‌ బాషా, ఇమ్రాన్‌, బెల్లం అల్లాబక్షు, ముస్తఫా హజరత్‌, ఎంఐ హనీఫ్‌, మదనమోహన్‌ రెడ్డి, మహ్మద్‌, మున్వర్‌ ఆలీ, రాజేష్‌, 

Read more