కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

ABN , First Publish Date - 2022-11-30T23:47:13+05:30 IST

సీఎం జగనమోహనరెడ్డి మదనపల్లె పర్యటన సందర్భంగా గుర్రంకొండలో బుధవారం వాహనాలు నిలిపేశారు.

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
గుర్రంకొండలో నిలిచిన వాహనాలు

గుర్రంకొండ, నవంబరు 30: సీఎం జగనమోహనరెడ్డి మదనపల్లె పర్యటన సందర్భంగా గుర్రంకొండలో బుధవారం వాహనాలు నిలిపేశారు. గుర్రంకొండ మీదుగా బెంగళూరు, మదనపల్లె, పంగనూరు, పలమనేరు, కేరళ, తమిళనాడులకు వెళ్లే లారీలు, టెంపోలను ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఆపేశారు. బుధవారం ఉదయం నుంచి వాహనాలను రోడ్డు పక్కనే నిలిపేశారు. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర రోడ్డు వెంబడి బారులు తీరాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు మధ్యలో తీవ్రం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 4 గంటలకు వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

అంగళ్ళులో స్తంభించిన రాకపోకలు

కురబలకోట, నవంబరు 30: మండ లంలోని అంగళ్ళు జాతీయ రహదా రిపై వాహనాలు భారీగా నిలిచిపో యి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి రాకపోకలు స్తంభించిపోయాయి. బుధవారం మదనపల్లె పట్టణంలో విద్యాదీవెన కార్యక్ర మానికి సీఎం జగన హాజరు కావడంతో పోలీసు లు తీవ్రఆంక్షలు విధించారు. మదన పల్లె పట్టణంలోకి వాహనాలు వెళ్ళ నీయకుండా గుర్రకొండ మీదగా వెళ్ళేలా చర్యలు చేపట్టారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సీఎం పర్యటన కారణంగా వాహనాలు బారులు తీరి నిలిచాయి.

Updated Date - 2022-11-30T23:47:13+05:30 IST

Read more